కంపెనీల ఉద్యోగులకు ఆరోగ్య సేవలు

ABN , First Publish Date - 2021-07-31T06:34:20+05:30 IST

ఉద్యోగులకు ఆరోగ్య, వెల్‌నెస్‌ సేవలందించడానికి కంపెనీలకు వీలు కల్పించే విధం గా అపోలో హాస్పిటల్స్‌కు చెందిన అపోలో 24/7, మైక్రోసాఫ్ట్‌ ఇండియా చేతులు కలిపాయి.

కంపెనీల ఉద్యోగులకు ఆరోగ్య సేవలు

జట్టు కట్టిన అపోలో, మైక్రోసాఫ్ట్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఉద్యోగులకు ఆరోగ్య, వెల్‌నెస్‌ సేవలందించడానికి కంపెనీలకు వీలు కల్పించే విధం గా అపోలో హాస్పిటల్స్‌కు చెందిన అపోలో 24/7, మైక్రోసాఫ్ట్‌ ఇండియా చేతులు కలిపాయి. ఇందుకు అనుగుణంగా ఎంటర్‌ప్రైజ్‌ సొల్యూషన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నాయి. మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ వర్క్‌ సూట్‌లో ఇది ఉంటుంది. ప్రయోగాత్మకంగా మైక్రోసా్‌ఫ్టకు చెందిన ఉద్యోగులపై మూడు నెలల పాటు దీన్ని పరీక్షించారు. పైలెట్‌ ప్రోగామ్‌లో భాగంగా 5,000 మంది మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఇందులో 50 శాతానికి పైగా ఉద్యోగులు అపోలో డాక్టర్‌తో వర్చువల్‌ కన్సల్టెన్సీ తీసుకున్నారు. 2,600 మందికి పైగా ఉద్యోగులు ఔషధాలు ఆర్డర్‌ చేయడానికి యాప్‌ను ఉపయోగించారు. మైక్రోసా్‌ఫ్టలోని ఒక్కో ఉద్యోగి అపోలో నెట్‌వర్క్‌లోని 7,000 మంది డాక్టర్లు, స్పెషలిస్టుల కన్సల్టెన్సీ పొందడానికి వీలుంటుంది. 


డిజిటల్‌ హెల్త్‌ సొల్యూషన్ల వైపు చూపు: కొవిడ్‌ మూడో దశ భయాలతో తమ ఉద్యోగులు, వారి కుటుంబాలకు మద్దతుగా నిలిచేందుకు కంపెనీలు డిజిటల్‌ హెల్త్‌కేర్‌ సొల్యూషన్ల కోసం చూస్తున్నాయి. అపోలో 24/7, మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ ద్వారా ఉద్యోగులు టెలీ కన్సల్టెన్సీతోపాటు వ్యాక్సిన్‌ బుకింగ్‌, ఔషధాల కొనుగోలు, డయాగ్నోస్టిక్‌ పరీక్షలు, ఎలకా్ట్రనిక్‌ హెల్త్‌ రికార్డు, వెల్‌నెస్‌ ప్రోగ్రామ్‌లు వంటి సేవలను ఒక్క క్లిక్‌తో పొందవచ్చని అపోలో హాస్పిటల్స్‌ తెలిపింది. అత్యాధునిక టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో డిజిటల్‌ టెక్నాలజీల ద్వారా వైద్య, ఆరోగ్య సేవలను రోగులు పొందగలుగుతున్నారని అపోలో 24/7 సీటీఓ మధు అరవింద్‌ తెలిపారు. 

Updated Date - 2021-07-31T06:34:20+05:30 IST