కరోనా కట్టడికి వైద్య సిబ్బంది కృషి

ABN , First Publish Date - 2021-06-15T05:23:48+05:30 IST

కరోనా కట్టడికి వైద్య సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమని తిరుపతి డివిజన్‌ వైద్యశాఖ అధికారి హేమలత కొనియాడారు.

కరోనా కట్టడికి వైద్య సిబ్బంది కృషి
ఫీవర్‌ సర్వేను పరిశీలిస్తున్న హేమలత

శ్రీకాళహస్తి, జూన్‌ 14: కరోనా కట్టడికి వైద్య సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమని తిరుపతి డివిజన్‌ వైద్యశాఖ అధికారి డాక్టర్‌ హేమలత కొనియాడారు. పట్టణ కొత్తపేటలో నిర్వహిస్తున్న ఫీవర్‌ సర్వేను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ గతనెల పురపాలక సంఘ పరిధిలో పాజిటివిటీ రేటు అధికంగా ఉందన్నారు. కరోనా నియంత్రణకు వైద్య సిబ్బంది కష్టపడడంతోనే కొవిడ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో వైద్యులు చంద్రమోహన్‌, సాగరిక, శాంతి, గిరిజ, ఏఎన్‌ం కాంచన, ఆశ వర్కరు జకీరాబేగం పాల్గొన్నారు. పట్టణ సన్నిధివీధిలోని శివసదన్‌ కొవిడ్‌ కేర్‌ సెంటరులో సోమవారం సాయంత్రానికి 69 పడకలు ఖాళీగా ఉన్నట్లు డాక్టర్‌ చంద్రమోహన్‌ తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ 31 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. శ్రీకాళహస్తిలో 161 యాక్టివ్‌ కేసులుండగా, వీటికి సంబంధించి 590 ప్రైమరీ, 876 సెకండరీ కాంటాక్టులున్నట్లు గుర్తుచేశారు. 

Updated Date - 2021-06-15T05:23:48+05:30 IST