Abn logo
May 17 2021 @ 00:15AM

కీళ్లనొప్పులు రాకూడదంటే..!

>
  • ఒమెగా 3 తక్కువగా తీసుకునే వారిలో కీళ్లు బిగుసుకుపోవడం, వాపు వంటి సమస్యలు కనిపిస్తాయి. సాల్మన్‌, ట్రౌట్‌, మాక్రెల్‌, సార్టినెస్‌ వంటి చేపలు ఎక్కువగా తినాలి. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్స్‌ పుష్కలంగా లభిస్తాయి. 
  • ఒకవేళ మీరు శాకాహారులైతే వాలనట్స్‌, అవిసెలు, ఫిష్‌ ఆయిల్‌ సప్లిమెంట్స్‌ను తీసుకోవాలి.
  • విటమిన్‌ సి ఎక్కువగా తీసుకోవాలి. స్ట్రాబెర్రీలు, ఆరెంజ్‌, కివి, పైనాపిల్‌, క్యాలిఫ్లవర్‌, బ్రొక్కోలి, క్యాబేజీ వంటివి ఎక్కువగా తినాలి.
  • పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్‌పై పోరాడే శక్తి లభిస్తుంది.
  • ధాన్యాలు, పండ్లు, కూరగయాల్లో కూడా తక్కువ ఫ్యాట్‌ ఉండే ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే కీళ్లనొప్పులు వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి.
  • యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందుల్లో ఉపయోగించే కెమికల్స్‌ అల్లంలో ఉంటాయి. కాబట్టి అల్లం టీ ఎక్కువగా తాగాలి. ఆహారపదార్థాల్లోనూ అల్లం వాడాలి. పసుపులో కూడా కీళ్లలో వాపును తగ్గించే గుణం ఉంది.