జాజికాయతో ఆరోగ్యం

ABN , First Publish Date - 2021-05-15T20:21:14+05:30 IST

సుగంధద్రవ్యమైన జాజి కాయలో ఆరోగ్యానికి తోడ్పడే సుగుణాలు ఉంటాయి. ఇది రోగనిరోధకశక్తి పెంచడంతో పాటు, మరెన్నో రుగ్మతలను తగ్గిస్తుంది.

జాజికాయతో ఆరోగ్యం

ఆంధ్రజ్యోతి(15-05-2021)

సుగంధద్రవ్యమైన జాజి కాయలో ఆరోగ్యానికి తోడ్పడే సుగుణాలు ఉంటాయి. ఇది రోగనిరోధకశక్తి పెంచడంతో పాటు, మరెన్నో రుగ్మతలను తగ్గిస్తుంది.


కప్పు వేడి పాలలో అర టీస్పూను తేనె, చిటికెడు యాలకుల పొడి, రెండు చిటికెల జాజి కాయ పొడి కలిపి తాగితే రోగనిరోధకశక్తి పెరగడంతో పాటు కమ్మని నిద్ర పడుతుంది.

జాజి కాయలో ఉండే మైరిస్టిసిన్‌, ఎలిమిసిన్‌, యూజినాల్‌, సఫ్రోల్‌ అనే ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ కీళ్ల నొప్పులు తగ్గిస్తాయి. ఈ పొడిని పాలతో కలిపి తీసుకోవాలి.

జాజి కాయ తినడం వల్ల జీర్ణ రసాల ఉత్పత్తి పెరుగుతుంది. దీన్లోని పీచు మలబద్ధకాన్ని తొలగిస్తుంది. కడుపు ఉబ్బరం సమస్య కూడా జాజి కాయతో తగ్గుతుంది. కాబట్టి దీన్ని వంటకాల్లో తరచుగా వాడుతూ ఉండాలి.

జాజికాయలోని యూజినాల్‌ అనే ఎసెన్షియల్‌ ఆయిల్‌ పంటి నొప్పిని తగ్గిస్తుంది.

తేనె చేర్చి తయారుచేసిన జాజి కాయ కషాయం వాంతులకు విరుగుడుగా పని చేస్తుంది.

జాజికాయ తినడం వల్ల పిత్తాశయం పనితీరు మెరుగై మధుమేహం అదుపులో ఉంటుందని ఎలుకల మీద చేపట్టిన ప్రయోగాల్లో తేలింది. కాబట్టి కేవలం మాంసాహార వంటకాలు, పిండి వంటల్లోనే కాకుండా కూరల్లో, అల్పాహారాల్లో జాజి కాయ వాడకం పెంచాలి. కషాయం రూపంలో, పాలతో కలిపి తీసుకుంటూ ఉండాలి. 


Updated Date - 2021-05-15T20:21:14+05:30 IST