Abn logo
Sep 27 2021 @ 03:01AM

వారం రోజులుగా జ్వరం.. సెలవడిగితే ఇవ్వని అధికారులు.. చివరికి విషాదం!

  • పెబ్బేరు పీహెచ్‌సీ ఏఎన్‌ఎం మృతి
  • సెలవడిగితే నిరాకరించిన అధికారులు


వనపర్తి వైద్య విభాగం, సెప్టెంబర్‌ 26: ఆమె వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. సెలవడిగితే.. అధికారులు నిరాకరించారు. దీంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో అనారోగ్యంతోనే విధులకు హాజరైన ఆ ఆరోగ్య కార్యకర్త.. మృత్యువాత పడ్డారు. వనపర్తి జిల్లాలోని పెబ్బేరు పీహెచ్‌సీ బీ సెంటర్‌లో ఏఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న భాగ్యమ్మ (45) వారం రోజులుగా జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. డయాబెటిస్‌ పేషెంట్‌  కావడంతో.. సెలవు కావాలని జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు అధికారులు నిరాకరించడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో విధులకు హాజరవుతున్నారు. ఆదివారం ఉదయం కూడా విధులకు హాజరైన ఆమె.. మధ్యాహ్నం ఇంటికి చేరుకోగానే అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు జిల్లా ఆస్పత్రిలో చేర్పించా రు. సాయంత్రానికి పరిస్థితి విషమించి మృతి చెందారు. భాగ్యమ్మ మృతికి పని ఒత్తిడే కారణమంటూ జిల్లా అస్పత్రి ముందు సహోద్యోగులు ఆందోళన నిర్వహించారు.