ఎల్‌ఐసీ నుంచి ఆరోగ్య రక్షక్‌

ABN , First Publish Date - 2021-07-21T06:34:03+05:30 IST

ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ).. ‘ఆరోగ్య రక్షక్‌’ పేరుతో కొత్త ఆరోగ్య బీమా పథకం ప్రారంభించింది.

ఎల్‌ఐసీ నుంచి ఆరోగ్య రక్షక్‌

ముంబై: ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ).. ‘ఆరోగ్య రక్షక్‌’ పేరుతో కొత్త ఆరోగ్య బీమా పథకం ప్రారంభించింది. ఇది నాన్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌, రెగ్యులర్‌ ప్రీమియం, ఇండివిడ్యువల్‌, ఆరోగ్య  బీమా పథకం. అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్య రక్షణతో పాటు కష్టకాలంలో పాలసీదారుల కుటుంబ సభ్యులకు ‘ఆర్థిక’ రక్షణ కల్పించడం ఈ పథకం లక్ష్యం. వాస్తవ వైద్య ఖర్చులతో నిమిత్తం లేకుండా నిర్ణీత మొత్తాన్ని వైద్య ఖర్చుల కోసం చెల్లించడం ఆరోగ్య రక్షక్‌ పథకం ప్రత్యేకతని ఎల్‌ఐసీ పేర్కొంది.


పథకం ప్రత్యేకతలు 

వ్యక్తిగతంగా లేదా కుటుంబ సభ్యులతో కలిసి పాలసీ తీసుకోవచ్చు

18-65 ఏళ్ల మధ్య వయస్కులైన ప్రధాన పాలసీదారుడు, వారి జీవిత భాగస్వామి, తల్లిదండ్రులకూ కవరేజీ

91 రోజుల నుంచి 20 ఏళ్ల మధ్య వయస్కులైన పిల్లలకూ ఆరోగ్య బీమా

పిల్లలకు 25 ఏళ్ల వరకు, పెద్దలకు 80 ఏళ్ల వరకు బీమా కవరేజీ

ఆటో స్టెప్‌ అప్‌ ద్వారా కవరేజీ పెంచుకునే సౌలభ్యం

ప్రధాన పాలసీదారుడు చనిపోతే.. మిగతా వారికి ప్రీమియం చెల్లింపు నుంచి మినహాయింపు

పాలసీదారుల్లో ఎవరికైనా సర్జరీ జరిగినా, ఏడాది పాటు ప్రీమియం మినహాయింపు

అంబులెన్స్‌, హెల్త్‌ చెకప్‌ సదుపాయాలు

ఎల్‌ఐసీ న్యూ టర్మ్‌ అష్యూరెన్స్‌ రైడర్‌, ఎల్‌ఐసీ యాక్సిడెంటల్‌ బెనిఫిట్‌ రైడర్స్‌ను ఎంచుకునే అవకాశం

Updated Date - 2021-07-21T06:34:03+05:30 IST