వైరల్ వీడియో.. రోడ్డుపై చిందేసిన హెల్త్‌కేర్ వర్కర్లు!

ABN , First Publish Date - 2020-12-19T02:37:21+05:30 IST

హెల్త్‌కేర్ వర్కర్లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో దేనికి సంబం

వైరల్ వీడియో.. రోడ్డుపై చిందేసిన హెల్త్‌కేర్ వర్కర్లు!

వాషింగ్టన్: హెల్త్‌కేర్ వర్కర్లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో దేనికి సంబంధించింది? అందులో హెల్త్‌కేర్ వర్కర్లు ఏం చేశారనే  వివరాల్లోకి వెళితే.. 2020 సంవత్సరం మొత్తం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి చాలా కష్టంగా గడిచింది. మరీ ముఖ్యంగా ఆసుపత్రిలో పని చేసే వైద్యలు, వైద్య సిబ్బంది.. సంవత్సరం పోడువునా వారి ప్రాణాలను పణంగా పెట్టి కొవిడ్ బాధితులను రక్షించారు. ఈ క్రమంలో ప్రపంచానికి కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణాలను రక్షించే కొవిడ్ టీకా(ఫైజర్) అమెరికాలోని బోస్టన్ మెడికల్ సెంటర్‌కు మంగళవారం రోజు చేరడంతో అక్కడ పని చేసే హెల్త్‌కేర్ వర్కర్‌ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. బోస్టన్ మెడికల్ సెంటర్‌లో పని చేసే సిబ్బంది.. సంతోషంతో ఎగిరి గంతులు వేశారు. రోడ్డుపైకి వచ్చి డ్యాన్సు చేసి, తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఆ దృశ్యాలను కొందరు వీడియో తీసి, నెట్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 43 లక్షల మంది వరకు వీక్షించారు. 


Updated Date - 2020-12-19T02:37:21+05:30 IST