Jun 22 2021 @ 00:21AM

ఆరోగ్యంగా... యోగా!

అందంగా, ఆరోగ్యంగా ఉండటం కోసం పలువురు కథానాయికలు యోగాను ఆశ్రయిస్తున్నారు. దైనందిన జీవితంలో దాన్నో భాగం చేసుకున్నారు. ప్రతిరోజూ సాధన చేస్తున్నారు. యోగా చేస్తున్న సమయంలో తీసుకున్న ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ... ప్రజలలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కథానాయికలు వివిధ యోగా ఆసనాలతో సందడి చేశారు. ఆ ఫొటోలను మీరూ చూడండి.


తమన్నా, రకుల్‌, పూజా హెగ్డే, లక్ష్మీ మంచు, కీర్తీ సురేశ్‌, ప్రగ్యా జైస్వాల్‌, కేథరిన్‌, అదా శర్మ, ఆకాంక్షా సింగ్‌... అందరూ యోగా సాధన చేసేవారే. కథానాయిక అనుష్క పరిశ్రమలో అడుగుపెట్టకముందు యోగాలో శిక్షణ ఇచ్చేవారనే సంగతి తెలిసిందే. హిందీ హీరోయిన్లు కరీనా కపూర్‌, సారా అలీ ఖాన్‌, శిల్పా శెట్టి తదితరుల సౌందర్య రహస్యానికి యోగా ఓ కారణమని చెప్పవచ్చు. యోగా చేయడమంటే ఆసనాలు వేడయమే కాదు... శ్వాసపై ధ్యాస ఉంచడమూ అని తమన్నా చెప్పారు. ప్రేమోన్మాది యాసిడ్‌ దాడితో 53 సర్జరీల తర్వాత మానసికంగా, శారీరంగా కుంగుబాటుకు గురైన తన సోదరి రంగోలీ జీవితం యోగాతో ఎంతో మారిందని కంగనా రనౌత్‌ తెలిపారు. ఇంకా పలువురు కథానాయికలు యోగా ప్రాముఖ్యాన్ని వివరించారు.