విశాఖలో భారీగా పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2022-01-19T23:38:36+05:30 IST

జిల్లాలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు

విశాఖలో భారీగా పాజిటివ్ కేసులు

విశాఖ: జిల్లాలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు ఉధృతమవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1827 కేసులు నమోదయ్యాయి. విశాఖలో ఇప్పటివరకు 1,69,013 కేసులు నమోదయ్యాయి. కాగా 1,58,729 డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 9,137 చికిత్స పొందుతున్నారు. వైరస్ బారినపడి 1148 మృతి చెందారు. కరోనా కేసులు భారీగా పెరుగుతండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు అధికారులు పలు సూచనలు చేశారు. అవసరమయితేనే బయటకు రావాలన్నారు. తప్పనిసరిగా ముఖానికి మాస్క్ ధరించాలన్నారు. చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలన్నారు. 

 

Updated Date - 2022-01-19T23:38:36+05:30 IST