ఈ బ్యాటరీ ఫీచర్స్‌ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ABN , First Publish Date - 2020-06-12T01:04:30+05:30 IST

బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్‌ కార్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసింది. అయితే ఈ కార్లలోని బ్యాటరీ కెపాసిటీ కారణంగా తక్కువ ఆదరణ ..

ఈ బ్యాటరీ ఫీచర్స్‌ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్‌ కార్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.  అయితే ఈ కార్లలోని బ్యాటరీ కెపాసిటీ కారణంగా వీటికి తక్కువ ఆదరణ లభించింది. చార్జింగ్‌ ఎంత మైలేజీ ఇస్తుందన్నది ఒక ఎత్తు అయితే .. బ్యాటరీ ఎన్నేళ్లు పనిచేస్తుందన్నది మరొక ఎత్తు. తరచూ బ్యాటరీలు మార్చాల్సిన పరిస్థితి నెలకొంది. చార్జింగ్‌ కూడా తక్కువ మైలేజీ ఇవ్వడం ఇంకో కారణంగా చెప్పుకోవచ్చు. ఎలక్ట్రిక్‌ కార్లలో బ్యాటరీలకే ఎక్కువ ధరలు వెచ్చించాల్సి వస్తోంది. అందుకే బ్యాటరీ కార్లంటే జనం మొగ్గు చూపడంలేదని ఓ వాదన. ఇకపై ఆ ఆలోచనకే తావులేకుండా సరికొత్త బ్యాటరీ రూపకల్పన చేసుకోబోతోంది.


ఒక విధంగా చెప్పాలంటే ఈ బ్యాటరీ జీవితకాలం పనిచేయనుంది. ఇప్పటికే ఈ బ్యాటరీపై చైనా కంపెనీ కాంటెంపరరీ అంపెరెక్స్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ భరోసా ఇస్తోంది. ఇప్పటికే ఈ సీఏటిల్ కంపెనీ టెస్లా, ఫోక్స్‌ వ్యాగన్‌ కార్లకు బ్యాటరీలు అందిస్తోంది. . ఇప్పుడున్న ఎలక్ట్రిక్‌ కార్ల బ్యాటరీ సామర్థ్యం 1.50 లక్షల మైళ్లు కాగా గరిష్టంగా బ్యాటరీలకు ఇస్తున్న వారెంటీ 8 సంవత్సరాలు మాత్రమే. వీటిని తలదన్నేలా  చైనా కంపెనీ కాంటెంపరరీ అంపెరెక్స్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ కొత్త గ్యారెంటీ ఇస్తోంది.


20 లక్షల కిలోమీటర్ల సామర్థ్యంతో బ్యాటరీ తయారు చేస్తామని చెబుతోంది. 16 సంవత్సరాల వారెంటీ కూడా ఇస్తామంటోంది. 20 లక్షల కిలోమీటర్లంటే భూమిని 100 సార్లు చుట్టిరావొచ్చని అంటోంది.  ఓ జీవితకాలంలో బ్యాటరీ మార్చాల్సిన అవసరం లేదని పేర్కొంటోంది. కారు చెడిపోయినా బ్యాటరీకి మాత్రం ఢోకా ఉండదని భరోసా ఇస్తోంది. ఎవరైనా ఆర్డరిస్తే ఈ సరికొత్త బ్యాటరీ తయారు చేస్తామంటూ చైనా కంపెనీ కాంటెంపరరీ అంపెరెక్స్‌ టెక్నాలజీ లిమిటెడ్ ప్రకటించింది. ఈ బ్యాటరీ వాడుకలోకి వస్తే ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాలు పుంజుకోనున్నాయి. 

Updated Date - 2020-06-12T01:04:30+05:30 IST