మధ్యతరగతి ప్రజలపై మహాభారం!

ABN , First Publish Date - 2021-02-21T05:31:32+05:30 IST

రోజురోజుకూ నిత్యావసర సరుకులు, పెట్రో, గ్యాస్‌ ధర లు పెరుగుతుండడంతో మధ్యతరగతి ప్రజలకు భారంగా తయారైంది. కరోనా సాకుతో నిత్యావసర సరుకుల ధరలు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయని పె ట్రోల్‌ ధరలు పెరుగుతున్నాయి.

మధ్యతరగతి ప్రజలపై మహాభారం!

కాగుతున్న వంట నూనెల ధరలు

మండుతున్న పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు

నిత్యావసర సరకులదీ అదే పరిస్థితి

ధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలం

ఆర్మూర్‌, ఫిబ్రవరి 20: రోజురోజుకూ నిత్యావసర సరుకులు, పెట్రో, గ్యాస్‌ ధర లు పెరుగుతుండడంతో మధ్యతరగతి ప్రజలకు భారంగా తయారైంది. కరోనా సాకుతో నిత్యావసర సరుకుల ధరలు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయని పె ట్రోల్‌ ధరలు పెరుగుతున్నాయి. పెట్రో ధరల ప్రభావం అనేక సరుకులు, వస్తువుల మీద పడుతోంది. నెల రోజు ల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు బాగా పెరిగాయి. రోజుకు కొ న్ని పైసలు పెరుగుతూ వచ్చింది. ఆర్మూర్‌లో జనవరి 18న పెట్రోల్‌ లీటరు ధర 89.41, డీజిల్‌ ధర రూ.82.92 ఉండగా, ఈనెల 18న పెట్రోల్‌ రూ.94.29, డీజీల్‌ ధ ర రూ.88.30కి పెరిగింది. అంటే లీటరు పెట్రోల్‌ రూ.4.88, డీ జిల్‌ రూ.5.38 పెరిగింది. నిజామాబాద్‌ జిల్లాలో సుమారు ఐదు లక్షల వాహనాలు ఉండగా, ప్రతీరోజు రెండు లక్షల లీటర్ల పెట్రోలు, నాలుగు లక్షల లీటర్ల డీజీల్‌ విక్రయాలు జరుగుతున్నాయి. ఈ లెక్కన జిల్లా ప్రజలపై రూ.30లక్షల భారం పడుతోంది. రోజురోజుకు పెరుగుతున్నందున ధర ఎంత వరకు వెళ్తుందోనని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్‌ కంపెనీలు ధర పెంచుతుండ గా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం పట్ల ని రసన వ్యక్త చేస్తున్నారు. అంతర్జాతీయంగా చమురు ధర లు తగ్గిన సమయంలో పెట్రో ధరలు తగ్గించకుండా ప న్నులు పెంచారు. పెరిగిన సమయంలో పన్నులు తగ్గించ కుండా వినియోగదారుల మీద ప్రభుత్వాలు భారం వేస్తు న్నాయి. పెట్రో ధరలు పెరగడంతో రవాణా చార్జీలు పెరు గుతున్నాయి. గ్యాస్‌ సిలిండర్‌ ధర 12రోజుల్ల రెండు సార్లు పెరిగింది. ఈనెల 3వ తేదీన రూ.25పెరగగా, 15వ తేదీన రూ.50 పెరిగింది. ఇదే నెలలో ఒక్కో సిలిండర్‌ రూ.75 పెరిగినట్లయింది. అంటే సుమారు పది శాతం ధర ఇదే నెలలో పెరిగింది. ప్రస్తుతం ఆర్మూర్‌లో సిలిండర్‌ ధర రూ.845కు చేరుకుంది. 

 సలసలా కాగుతున్న వంట నూనెల ధరలు 

వంట నూనెల ధరలు సలసలకాగుతున్నాయి. నూనెల తో వంట చేయాలంటే గృహిణులు ఆలోచించాల్సిన పరిస్థి తి ఏర్పడింది. ఏడాదిలో 50శాతంపైగా ధర పెరగడం గ మనార్హం. గత మార్చిలో సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ప్యాకెట్‌ రూ. 90 ఉండగా, ప్రస్తుతం రూ.145 నుంచి రూ.150వరకు చే రుకుంది. పామాయిల్‌ ధర రూ.80నుంచి రూ.100కు చేరు కుంది. వంట నూనెల ధరలు నియంత్రించడంలో ప్రభు త్వం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కంపెనీ లు ఇష్టానుసారంగా రోజురోజుకూ ధరలు పెంచుతుంటే నియంత్రించడం లేదు. కరోనా వల్ల ముడిసరుకు దిగుమ తి కావడంలేదని, మును ప్యాక్చరింగ్‌ కావడంలేదని సాకు చెప్పిధరలు పెంచేశారు. దీపం నూనె పౌచ్‌ రూ.90నుంచి రూ.115కు పెరిగింది. ఒక కంపెనీ టీ పొడి రూ.105నుంచి రూ.130కి పెరిగింది. మరో కంపెనీ టీ పొడి రూ.30నుంచి రూ.45కు పెరిగింది. కుడుకల ధర అమాంతం పెరిగింది. కుడుకల ధర కరోనా సమయంలో రూ.110కి కిలో ఉండ గా ప్రస్తుతం రూ.190కి పెరిగింది. కరోనా సమయంలో అధికంగా వాడిన కొన్ని సరుకులు, మందుల ధరలు కూ డా పెరిగాయి. సర్వరోగ నివారిణిగా పేరొందిన ఒక మం దు ధర గతంలో రూ.45 నుంచి రూ.60కి పెరిగింది. 

 బియ్యం ధరలు పైపైకి..

 ఈయేడు రాష్ట్రంలో సన్నరకం ధాన్యం ఎక్కువ విస్తీర్ణ ంలో సాగైంది. రైతులు సన్నరకం ధాన్యానికి విక్రయించ డానికి నానా తంటాలు పడ్డారు. సన్నరకం పండించిన రై తులు లాభపడలేదు. కానీ మధ్యదళారులు ఎక్కువగా లా భపడుతున్నారు. ప్రస్తుతం బీపీటీ ధర క్వింటాకు రూ.4వే ల పైన, హెచ్‌ఎంటీ రూ.5వేలపైన విక్రయిస్తున్నారు.

 పెరగనున్న సబ్బులు, బిస్కెట్ల ధరలు..

 సబ్బులు, బిస్కెట్లు, షాంపులు వంటి ధరలు కూడా పెంచడానికి కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. ముడిప దార్ధాల వ్యయం పెరగడం వల్ల నాలుగు నుంచి ఐదు శా తం ధరలు పెంచడానికి ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు సిద్ధమవు తున్నాయి. వంట నూనెల ధరలు పెరుగుతున్న నేపథ్యం లో తమ వ్యయాలు కూడా పెరిగినందున ధరలు పెంచా లని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు భావిస్తున్నాయి. అన్ని ధరలు పెరగడంతో పేద ప్రజలకు ప్రతీనెల పెద్ద మొత్తంలో ఆర్థిక భారంపడే అవకాశముంది. ప్రతీనెల ఖర్చులు పెరు గుతున్న తమ ఆదాయం పెరగడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more