Abn logo
Feb 6 2020 @ 22:55PM

హీటెక్కుతున్న సొసైటీ చైర్మన్‌ పదవి

నిజామాబాద్‌ రూరల్‌, ఫిబ్రవరి 5:

రోజురోజుకూ పెరుగుతున్న ఆశావహులు

డైరెక్టర్‌ అయ్యేందుకు సిద్ధపడుతున్న రైతులు

 

 ప్రాథమిక వ్య వసాయ సహకార సంఘాల ఎన్నికల్లో చైర్మన్‌గిరి దక్కి ంచుకునేందుకు అధికార పార్టీ నేతలు, రైతులు పోటీపడుతున్నారు. ఈ నెల 15న ఎన్నికలు జరుగనుండటంతో పావులు కదుపుతున్నారు. ఇదివరకు డైరెక్టర్లుగా, చైర్మన్లుగా చేసినవారు మరోసారి అవకాశం ఇవ్వాలని తోటివారిని, పోటీదారులను ప్రాదేయపడుతున్నారు. ఎవరికి వారే గ్రూపులుగా రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను హైదరాబాద్‌వెళ్లి స్వయంగా కలుస్తున్నారు. ఎమ్మె ల్యే ఎవరికీ హామీ ఇవ్వనప్పటికీ ఆయన మద్దతు తమకే ఉందని గ్రామాల్లో ప్రచారం చేసుకుంటూ హడావుడి పెంచుతున్నారు. వారికి ధీటుగా బీజేపీ నేతలు సైతం తాము కూడా రంగంలోనే ఉన్నామని పోటీకి సై అంటు న్నారు. మండలంలో గుండారం, ముత్తకుంట, నిజామా బాద్‌ సొసైటీలున్నాయి. వీటిలో గుండారం సొసైటీ పెద్ద ది. ఈ సొసైటీ కింద గుం డారం, ఖానాపూర్‌, కాలూరు, శ్రీనగర్‌, శాస్త్రినగర్‌, మల్కాపూర్‌-ఎ గ్రామాలున్నాయి. పాల్ద సొసైటీలో పాల్ద, తిర్మన్‌పల్లి, ఆకుల కొండూరు గ్రా మాలున్నాయి. ముత్తకుంట సొసైటీ పరిధిలో ముత్తకుం ట, కొత్తపేట, మల్కాపూర్‌, మల్లారం, ధర్మారం గ్రామా లున్నాయి. నిజామాబాద్‌సొసైటీ పరిధిలో కేవలం నిజా మాబాద్‌ పట్టణ పరిసర ప్రాంత రైతులు మాత్రమే ఉ న్నారు. నిజామాబాద్‌ సొసైటీ లో 1,741, పాల్ద సొసైటీ లో 923 మంది, ముత్తకుంట 813 మంది, గుండారంలో 1239 మంది సభ్యులున్నారు. చైర్మన్‌ పదవి కోసం ప లు పార్టీ నేతలు ఉత్సాహపడుతున్నారు. సొసైటీలకు ఓటర్ల జాబితా సోమవారం విడుదల చేశారు. చైర్మన్‌ పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు.

Advertisement
Advertisement