తెలంగాణలో భారీగా కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-21T01:26:31+05:30 IST

రాష్ట్రంలో ఒమైక్రాన్‌ కరోనా వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది

తెలంగాణలో భారీగా కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో ఒమైక్రాన్‌ కరోనా వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4,207 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 1,645 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ 380, రంగారెడ్డిలో 336 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం నమోదయ్యే కేసుల్లో 95 శాతానికిపైగా ఒమైక్రాన్‌ వేరియంట్‌వే ఉంటున్నాయి. గొంతులో గరగర, బాడీ పెయిన్స్‌, తలనొప్పి, ముక్కుకారడం, పొడి దగ్గురావడం, జ్వరం లాంటివి ప్రస్తుత వేవ్‌లో కరోనా లక్షణాలుగా కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కొందరిలో మాత్రం 4-5 రోజుల పాటు ఒళ్లు నొప్పులు ఉంటున్నాయని అంటున్నారు. జ్వరం కూడా ఒకటి రెండు రోజుల తర్వాత తగ్గిపోతోందని, వైరల్‌ లోడ్‌ అంతా గొంతులోనే ఉండటంతో ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్‌ సోకడం లేదని వివరిస్తున్నారు. అందుకే ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రుల్లో అడ్మిషన్లు తక్కువగా ఉంటున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.

Updated Date - 2022-01-21T01:26:31+05:30 IST