హిమాయత్ సాగర్‌కు భారీగా వరద నీరు

ABN , First Publish Date - 2021-07-16T00:39:19+05:30 IST

జిల్లాలోని హిమాయత్ సాగర్‌కు వరద నీరు భారీగా వస్తోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న

హిమాయత్ సాగర్‌కు భారీగా వరద నీరు

రంగారెడ్డి: జిల్లాలోని హిమాయత్ సాగర్‌కు వరద నీరు భారీగా వస్తోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో హిమాయత్ సాగర్‌కు వరద వస్తోంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి వెంకటాపూర్ ఈసీ కాలువ గుండా వరదనీరు వస్తున్నది. హిమాయత్ సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు. కాగా ప్రస్తుత నీటిమట్టం 1759.39 అడుగులకు నీరు చేరింది. వరద నీరు వస్తుండటంతో సాగర్ వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. 



Updated Date - 2021-07-16T00:39:19+05:30 IST