సోమశిల ప్రాజెక్టులోకి భారీగా వరద

ABN , First Publish Date - 2021-11-19T02:30:13+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా జిల్లాతో పాటు, చిత్తూరు, కడప

సోమశిల ప్రాజెక్టులోకి భారీగా వరద

నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా జిల్లాతో పాటు, చిత్తూరు, కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని సోమశిల జలాశయానికి  వరద ప్రవాహం పెరుగుతున్నది. ప్రాజెక్టులోకి 1,34,853 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో,  99,853 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. జలాశయం పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీలు. ప్రస్తుత నీటిమట్టం 70.581 టీఎంసీలుగా ఉంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు  జలాశయం నుంచి 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.  




Updated Date - 2021-11-19T02:30:13+05:30 IST