భారీగా గుట్కా, ఖైనీ స్వాధీనం

ABN , First Publish Date - 2021-06-21T04:33:36+05:30 IST

పాతపట్నం మండల పరిధిలోని సీది గ్రామం వద్ద ఆదివారం ఆకస్మికంగా నిర్వహించిన వాహన తనిఖీలో ఒక వాహనంలో భారీ స్థాయిలో గుట్కా, ఖైనీ, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ మహమ్మద్‌ అమీర్‌ ఆలీ తెలిపారు.

భారీగా గుట్కా, ఖైనీ స్వాధీనం
పట్టుబడిన ఖైనీ, గుట్కా నిల్వలు, మద్యం బాటిళ్లతో పోలీసులు

మెళియాపుట్టి, (పాతపట్నం), జూన్‌ 20: పాతపట్నం మండల పరిధిలోని సీది గ్రామం వద్ద ఆదివారం ఆకస్మికంగా నిర్వహించిన వాహన తనిఖీలో ఒక వాహనంలో భారీ స్థాయిలో గుట్కా, ఖైనీ, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ మహమ్మద్‌ అమీర్‌ ఆలీ తెలిపారు. ఒడిశా రాష్ట్ర హడ్డుబంగి నుంచి అడ్డదారుల్లో ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ తనిఖీల్లో 106 బ్యాగులతో గుట్కా, ఖైనీ ప్యాకెట్లు, 48 బాటిళ్ల 180 ఎంఎల్‌ మద్యం సీపాలను పట్టుకున్నామన్నారు. బేగులతో గుట్కాఖైనీలను 180ఎంఎల్‌ 48బాటిళ్లను పట్టుకున్నామన్నారు. వీటి విలువ రూ.4 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశామని తెలిపారు. అక్రమ రవాణాలో పట్టుపడిన సరుకును, వాహనాన్ని సీజ్‌ చేసి హుడ్డబంగికి చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆర్‌.రవిప్రసాద్‌ తెలిపారు.


 


Updated Date - 2021-06-21T04:33:36+05:30 IST