నెల్లూరు జిల్లాలో జోరువాన

ABN , First Publish Date - 2022-01-18T01:48:53+05:30 IST

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి జోరువాన కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. సంక్రాంతి పండుగ తరువాత పాఠశాలలు

నెల్లూరు జిల్లాలో జోరువాన

నెల్లూరు: నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి జోరువాన కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. సంక్రాంతి పండుగ తరువాత పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు పునఃప్రారంభం కావటంతో ప్రజలు తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్లి వర్షంలో తడిసిపోయారు. ప్రధాన, చిన్న రహదారులన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. రోడ్లపైకి వర్షపునీరు చేరటంతో గుంతల మయమైన రోడ్లపై ప్రయాణించలేక వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. ఒక వైపు చలి... మరోవైపు కొవిడ్‌... వీటికి తోడు జలుబు, దగ్గులతో బాధ పడుతున్నవారిని ఈ వర్షం బాగా ఇబ్బంది పెట్టింది.  మంగళవారం కూడా వర్షం పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2022-01-18T01:48:53+05:30 IST