నిండా మునిగిన రైతులు !

ABN , First Publish Date - 2022-01-18T04:08:50+05:30 IST

అకాల వర్షం కారణంగా మండలంలోని పుచ్చ, వేరుశనగ రైతులు నిండా మునిగిపోయారు. సోమవారం తెల్లవారుజామున కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో భారీవర్షం కురిసింది.

నిండా మునిగిన రైతులు !
నీటిలో తడిసిన వేరుశనగ పంట

కోట, జనవరి 17 : అకాల వర్షం కారణంగా మండలంలోని పుచ్చ, వేరుశనగ రైతులు నిండా మునిగిపోయారు. సోమవారం తెల్లవారుజామున  కోట,  వాకాడు, చిట్టమూరు మండలాల్లో భారీవర్షం కురిసింది. దీంతో కొత్తపట్నం,  గోవిందుపల్లి, వావిళ్లదొరువు, శ్రీనివాససత్రం, సున్నపుపడియ, గంగిటివానిదిబ్బ గ్రామాల్లో వేరుశనగ పైరు నీటమునిగింది.. కొన్ని గ్రామాల్లో 10 రోజుల క్రితం వేరుశనగ పంట నూర్పిడికి రైతులు సిద్ధం చేసుకున్నారు.  అకాలవర్షంతో వేరుశనగ కట్టె, కాయలు తడిసిపోయాయి.  కొత్తపట్నం పంచాయతీలోనే 1200 ఎకరాలకు పైగా వేరుశనగ పంటకు నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు.  గూడలి,  కొండుగుంట,  రాఘవాపురం, మద్దాలి, తదితర గ్రామాల్లో వారం రోజుల వయసున్న పుచ్చ మొక్కలు కుళ్లిపోతాయేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2022-01-18T04:08:50+05:30 IST