Abn logo
Sep 28 2021 @ 19:02PM

మార్కెట్’పై... తీవ్ర ఒత్తిడి... భారీ నష్టాలు...

ముంబై : మార్కెట్లు ఇవాళ భారీ ఒడిదుడుకుల నేపధ్యంలో భారీ నష్టాలతో ముగిసాయి.ఐటీ, బ్యాంక్ నిఫ్టీ, స్మాల్ అండ్ మిడ్ క్యాప్, కేపిటల్ గూడ్స్, హెల్త్ సెక్టార్, టెక్ షేర్లలో భారీగా అమ్మకాలు కొనసాగాయి. పీఎస్ఈ, మెటల్,కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు లాభపడ్డాయి. టాప్ గెయినర్లుగా పవర్ గ్రిడ్, ఎన్‌టిపిసి, కోల్ ఇండియా,ఐఓసి, బిపిసిఎల్ 4.52-2.14శాతం వరకు పెరిగాయి. లూజర్లలో భారతి ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్స్,బజాజ్ ఫిన్సర్వ్ 3.65-2.67శాతం వరకు  నష్టపోయాయి. గెయినర్ల జాబితాలో... పబ్లిక్ రంగ కంపెనీ షేర్ల హవా ఎలా నడిచిందో తెలిసిపోతుంది. నష్టాలకు కారణం గ్లోబల్ సంకేతాలు, ప్రత్యేకించి అమెరికా,చైనా నుంచి వచ్చిన సంకేతాలు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. 


క్రూడ్ ఆయిల్ ధర నేపధ్యంలో... 

డెట్ సీలింగ్ పెంచకుండా అమెరికా సెనేట్ నిర్ణయం తీసుకుంది. ఇది డిఫాల్ట్ సమస్యకు దారితీస్తుందని పరిశీలకులు హెచ్చరించారు. ఇదే మన మార్కెట్లపై కూడా పరోక్షంగా ప్రభావం చూపించింది. ఇక చైనాలో పవర్ షార్టేజ్ కారణంగా... దేశంలోని తయారీరంగం మందగిస్తుందనే అంచనా... దీంతో సప్లై చైన్ దెబ్బతింటుందన్న భయం చివరి గంటలో బయింగ్ కాస్త నష్టాలను పూడ్చింది.