తాడికొండ మండలంలో భారీ గాలులతో వర్షం

ABN , First Publish Date - 2021-05-14T06:14:11+05:30 IST

మండలంలో భారీ గాలులు, ఉరుములు, మెరుపులతో గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వర్షం కురిసింది. రోడ్లు జలమయమై పెద్దఎత్తున నీరు పారాయి.

తాడికొండ మండలంలో భారీ గాలులతో వర్షం
తాడికొండలో పడిపోయిన విద్యుత్‌ స్తంభం

తాడికొండ, మే 13: మండలంలో భారీ గాలులు, ఉరుములు, మెరుపులతో గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వర్షం కురిసింది. రోడ్లు జలమయమై పెద్దఎత్తున నీరు పారాయి. కాల్వల్లో వ్యర్ధాలు నీటి పారుదలకు అడ్డుపడటంతో పంచాయతీ పారిశుధ్య కార్మికులు వాటిని తొలగించారు. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా తాడికొండ ఎస్సీ కాలనీలో మూడు చోట్ల విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి. లచ్చనగుడిపూడి, దామరపల్లి, లాం గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాలు పడిపోవటంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ శాఖ సిబ్బంది మరమ్మతులు చేసిన తరువాత రాత్రి 7 గంటలకు విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. అడ్డరోడ్డు సమీపంలోని మార్గదర్శి పాఠశాల వద్ద గాలులకు చెట్టు పడిపోవటంతో పంచాయతీ కార్మికులు చెట్టును పక్కకు నెట్టివేశారు. వేసవి కాలంలో వర్షం పడటం చల్లగాలులు వీచటంతో వేడి నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. 


Updated Date - 2021-05-14T06:14:11+05:30 IST