Abn logo
Sep 26 2021 @ 23:44PM

ముంచుతున్న కొవ్వాడ వరద

రాగోలపల్లి కల్వర్టుపై ప్రవహిస్తున్న కొవ్వాడ వరద నీరు

తాళ్లపూడి, సెప్టెంబరు 26: ఇటీవల కురిసిన వర్షాలకు ఎగువప్రాంతం నుంచి కొవ్వాడ వరద పొంగిపొర్లుతోంది. చేలను ముంచెత్తి రాగోలపల్లి కల్వర్టుపై నుంచి ఉధృతిగా వరదనీరు ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు అన్నదేవరపేట, రాగోలపల్లి కాజ్‌వేలను ముంచెత్తి ఉరకలతో వరదనీరు పరుగులు పెడుతోంది. దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి మోకాలి లోతు నీరు చేరింది. కాజ్‌వే రెయిలింగ్‌ లేకపోవడంతో ప్రయాణం పొంచిఉందని తెలిసినా ధైర్యం చేసి వాహనాలపై ప్రయాణిస్తున్నారు. అనేకమంది వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన సంఘటనలున్నాయి. కాజ్‌వేలపై రెయిలింగ్‌ ఏర్పాటుచేయాలని, హెచ్చరిక బోర్డులు అమర్చాలని ప్రజలు కోరుతున్నారు.