Abn logo
Sep 27 2021 @ 23:11PM

గులాబ్‌ గుభేల్‌

జంగారెడ్డిగూడెం పట్టెన్నపాలెం వద్ద పోటెత్తిన జల్లేరు వాగు

కుండపోత వర్షం.. పల్లపు ప్రాంతాలు జలమయం

ఏజెన్సీలో పొంగిన వాగులు.. రాకపోకలు బంద్‌


జంగారెడ్డిగూడెం, సెప్టెంబరు 27 : గులాబ్‌ తుఫాన్‌తో మండలం అంతా అతలాకుతం అయ్యింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లను వరద నీరు చుట్టిముట్టింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది. రోడ్లన్నీ జలమయం. పుట్లగట్లగూడెం గ్రామంలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలా లు చెరువులను తలపించాయి. వరద తాకిడికి పట్టెన్నపాలెం వద్ద జల్లేరు వాగ ఉదృతంగా ప్రవహిస్తోంది. కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం నాలుగు గేట్లు ఎత్తి ఇరిగేషన్‌ అధికారులు కిందికి నీరు విడుదల చేస్తున్నారు. జిల్లాలోనే జంగారెడ్డిగూడెం మండలంలో అత్యధిక వర్షపాతం 192.22 మిల్లీ మీటర్లు నమోదైంది. పట్టణంలో నీట మునిగిన ప్రాంతాలను ఎమ్మెల్యే ఎలీజా, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బత్తిన నాగలక్ష్మి, కౌన్సిలర్లు  పరిశీలించారు.

బుట్టాయగూడెం మండలం వీరన్నపాలెం వద్ద కొండవాగు ఉధృతి

బుట్టాయగూడెం: తుఫాన్‌ ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతంలో 12 గంట లపాటు కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయంకాగా విప్పలపాడు, వీరన్నపాలెం, రెడ్డిగణపవరం, అల్లికాల్వ, పద్మవారిగూడెం, ఊటవాగు తదితర కొండవాగులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహించాయి. విప్పలపాడు వద్ద ఏడాది క్రితం రూ.70 లక్షలతో నిర్మించిన కల్వర్టు కొట్టుకు పోయింది. సుమారు 30 గిరిజన గ్రామాలకుపైగా రాకపోకలు నిలిచిపోయా యి. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పలుప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీ లించారు. మండలంలో 95 ఎకరాల్లో వరి నీట మునిగినట్లు తహసీల్దార్‌ వైవీ.లక్ష్మీకుమారి, ఏవో బి.సుమలత తెలిపారు.

జలమయమైన జీలుగుమిల్లి – కామయ్యపాలెం రహదారి

జీలుగుమిల్లి: మండలంలో పలు కొండవాగులు పొంగి ప్రవహించా యి. గిరిజన గ్రామాల మధ్య రహదారులపై వరద నీరు ఉధృతంగా ప్రవ హించింది. అశ్వారావుపేట వాగు, జీలుగుమిల్లి వాగు, వంకవారిగూడెం వా గు, లంకాలపల్లి కాలువ, రాచన్నగూడెం వద్ద చిన్నవాగు పొంగి రోడ్లపై నుంచి ప్రవహించాయి. అంకన్నగూడెం పంచాయతీ సమీప దిబ్బగూడెం – వేపులపాడు గ్రామాల మధ్య ఇటీవల నిర్మించిన కల్వర్టు రోడ్డు దెబ్బతింది. రాచన్నగూడెంలో పిడుగు పడడంతో సమీపంలోని ఇంట్లో టీవి, విద్యుత్‌ మీటరు కాలిపోయాయి. పి.రాజవరం పాఠశాలలో వరద నీరు చేరింది. సుమారు 200 ఎకరాల్లో వేరు శనగ పంట వరద నీటికి కొట్టుకుపోయింది.

ద్వారకాతిరుమల మండలం గొల్లగూడెం వద్ద నీటి ఉధృతి

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల మండలం గొల్లగూ డెం, తిమ్మాపురం, దేవినేనివారిగూడెం, వీరిశెట్టిగూడెం గ్రామాల్లోని చెరువులు పొంగడంతో భీమడోలు – ద్వారకాతిరుమల ప్రధాన రహదారి వరద నీటిలో చిక్కుకుంది. ఎగువ నుంచి నీరు ఉధృతితో పంట కాలువలు, డ్రెయినేజీలు పొంగిపొర్లాయి. గొల్లగూడెం, దేవినేనివారిగూ డెం, ద్వారకాతిరుమల ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంభించాయి. దేవినేనివారిగూడెం గుర్రాలవాగు పొంగడంతో తిమ్మాపురం, వీరిశెట్టిగూడెం రహదారి, రామన్నగూడెం, వెంకట కృష్ణాపురం రహదారిపై వరద నీటితో రాకపోకలు నిలిచాయి.

దేవరపల్లి మండలం త్యాజంపూడిలో ఇళ్లలో చేరిన వరదనీరు

దేవరపల్లి: మండలంలో ఎడతెరిపిలేని వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. త్యాజంపూడిలోని ఇళ్లు మునిగాయి. హైస్కూల్‌లో కూడా భారీగా నీరు చేరింది. త్యాజంపూడి, బర్లవాగు, ఆవచెరువు, గౌరీపట్నంలోని కొవ్వాడ కాల్వ, దేవరపల్లి భారీ వర్షానికి పొంగి ప్రవహించడంతో వరి పొలాలు ముంపునకు గురాయ్యయని ఏవో విజయ్‌ తెలిపారు.