Advertisement
Advertisement
Abn logo
Advertisement

హైదరాబాద్‌కు మరోసారి భారీ వర్ష సూచన.. ఇళ్లల్లోనే ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారుల సూచన

హైదరాబాద్: హైదరాబాద్‌కు మరోసారి భారీ వర్షం పడుతుందని అధికారులు తెలిపారు. మరో గంటలో భారీ వర్షం పడుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. దాదాపు 6 గంటల పాటు నిరంతరాయంగా వర్షం పడే అవకాశముందని అధికారులు తెలిపారు. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. మాన్సూన్‌ బృందాలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. మోటార్లను సిద్ధంచేసి లోతట్టు ప్రాంతాలకు  అధికారులు తరలిస్తున్నారు. బయట ఉన్నవారు త్వరగా ఇళ్లకు వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. సహాయం కోసం ఫోన్‌ నెంబర్‌ 040-2955 5500 సంప్రదించాలని అధికారులు తెలిపారు.


ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగర రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. రోడ్డుపై ఏర్పడ్డ గుంతలు.. కంకరతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు సాగుతున్న ప్రాంతాల్లో సమస్య మరింత జఠిలంగా ఉన్నా ట్రాఫిక్‌ అధికారులు పట్టించుకోకపోవడంతో వాహనదారుల విలువైన సమయం వృథా అవుతోంది. రెండేళ్ల క్రితం వర్షాకాలంలో తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించిన ట్రాఫిక్‌ పోలీసులు నివారణ చర్యలు చేపట్టడానికి అప్పట్లో నడుం కట్టారు. దానికోసం ప్రత్యేకంగా సర్వే చేశారు. బ్లాక్‌స్పాట్‌లను గుర్తించారు. అక్కడ ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. కానీ ప్రస్తుతం సమస్యలు మళ్లీ మొదలయ్యాయి.

Advertisement
Advertisement