ఢిల్లీలో ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న భారీవ‌ర్షం

ABN , First Publish Date - 2020-08-13T15:35:37+05:30 IST

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. ఢిల్లీవాసుల‌కు...

ఢిల్లీలో ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న భారీవ‌ర్షం

న్యూఢిల్లీ: దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. ఢిల్లీవాసుల‌కు ఇది కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. అయితే భారీ వ‌ర్షాల కార‌ణంగా రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. మరో రెండు రోజులు ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. భారీ వర్షాల నేప‌ధ్యంలో ద్వారక ప్రాంతంలోని అండర్‌పాస్, మింటో బ్రిడ్జ్ అండర్‌పాస్ నీట మునిగింది. భారత వాతావరణశాఖ వెల్ల‌డించిన గణాంకాల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో ఆగస్టులో సాధారణం కంటే 72 శాతం తక్కువ వర్షపాతం న‌మోద‌య్యింది. గత ఏడాది ఆగస్టు మొదటి 12 రోజుల్లో దేశ రాజధానిలో 37.1 మిల్లీమీట‌ర్ల‌ వర్షపాతం కురిసింది. భారీ వ‌ర్షాలు కురుస్తున్నందున ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వాతావరణశాఖ సూచించింది. 

Updated Date - 2020-08-13T15:35:37+05:30 IST