Abn logo
Sep 20 2021 @ 00:46AM

భారీ వర్షం

హిరమండలంలో కురుస్తున్న వర్షం

హిరమండలం: జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. హిరమండలంలో కుండ పోత వర్షం కురిసింది. పంట పొలాల్లో నీరు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తు న్నారు. గత మూడు రోజులుగా వేడెక్కిన వాతావరణం ఒక్కసారి చల్లబడి ఉపశమనం కలిగించింది. 

 

ఇచ్ఛాపురంలో...

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురంలో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్ర ఎండతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు సాయంత్రం కురిసిన భారీ వర్షంతో ఊరట పొందారు. ఉరుములు, మెరుపులకు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. భారీ వర్షానికి రోడ్లు, కాలువలు జలమయమయ్యాయి. మురుగునీరు రోడ్లపై పారడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


భామినిలో...

భామిని: భామినిలో ఆదివారం భారీ వర్షం కురిసింది. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పొలాలో నీరు చేరుతోంది. దీంతో వరి, పత్తి పైరు కొన్నిచోట్ల కుళ్లి పోతోందని,  క్రిమిసంహారక మందులు చల్లలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు.