గాలివాన బీభత్సం.. ఖమ్మం జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో భారీవర్షం

ABN , First Publish Date - 2021-05-12T06:39:22+05:30 IST

ఖమ్మం జిల్లాలో మంగళ వారం సాయంత్రం పలుచోట్ల గాలి దుమారంతో భారీవర్షం కురిసింది. సాయంత్రం నాలు గు గంటలకే కారుమబ్బులతో ఆకాశం చీకటిగా మారింది.

గాలివాన బీభత్సం..   ఖమ్మం జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో భారీవర్షం
ఖమ్మంలో వర్షం కురుస్తున్న దృశ్యం

 మామిడి, మిర్చి, వరి పంటలకు నష్టం

ఖమ్మం, మే11(ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఖమ్మం జిల్లాలో మంగళ వారం సాయంత్రం పలుచోట్ల గాలి దుమారంతో భారీవర్షం కురిసింది. సాయంత్రం నాలు గు గంటలకే కారుమబ్బులతో ఆకాశం చీకటిగా మారింది. భారీ గాలి దుమారంతో వర్షం మొదలైంది. ఈ గాలివాన అరగంటకుపైగా విజృంభించడంతో మామిడి తోట ల్లో కాయలు నేలరాలాయి. కల్లాల్లో ఆరబోసిన మిర్చి, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిచి పోయింది. పలుచోట్ల మొక్కజొన్నలు కూడా వర్షానికి తడిచాయి. అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపో యారు. జిలాల్లో ఎంత వర్ష పాతం నమోదైంది. పంట నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఖమ్మం నగరంతో పాటు రఘునాధ పాలెం, కామేపల్లి, కొణిజర్ల, కూసుమంచి, చింతకాని, ముదిగొండ, నేలకొండపల్లి తదితర మండలాల్లో వర్షం కురిసిం ది. వర్షం వస్తుందని అంచనావేసిన కొందరు రైతులు తమ పంట లపై  టార్బాలిన్‌ లు కప్పారు. 


Updated Date - 2021-05-12T06:39:22+05:30 IST