Advertisement
Advertisement
Abn logo
Advertisement

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట్‌లో వర్షం కురిసింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, ఉప్పరపల్లి, మెహదీపట్నం, టోలీచౌకి, మాసబ్‌ట్యాంక్, నాంపల్లిలో భారీ వర్షం పడింది. వరద నీరు రోడ్డు పైకి వచ్చింది. దీంతో హైటెక్‌ సిటీ నుంచి కేపీహెచ్‌బీ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో మాన్సూన్ బృందాలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది.  


Advertisement
Advertisement