జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం

ABN , First Publish Date - 2020-09-26T11:06:47+05:30 IST

చెన్నూరు పట్టణం, మండలంలోని వివిధ గ్రామా ల్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సుమారు 2 గంటల పాటు వర్షం

జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం

చెన్నూరు, సెప్టెంబరు 25 : చెన్నూరు పట్టణం, మండలంలోని వివిధ గ్రామా ల్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సుమారు 2 గంటల పాటు  వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. నాలాల్లోని మురికి నీరు రహదారులపై ప్రవహించడంతో జన జీవనం స్తంభించిపోయింది. 


కోటపల్లి : మండలంలో శుక్రవారం రెండు గంటల పాటు భారీ వర్షం కుర వడంతో  ఏదులబంధం వద్ద వంతెన నీట మునిగింది. స్థానిక వాగులు వంకలు పొంగిపొర్లాయి.  వర్షం నిలిచిన అనంతరం కూడా వరద  ప్రభావం అలాగే ఉం డగా సాయంత్రం వరద తగ్గడంతో రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. నక్క లపల్లి రహదారిలోలోతొర్రె, బ్రహ్మణపల్లి వాగులు పొంగడంతో రవాణా నిలిచింది.


వేమనపల్లి: మండలంలో భారీ వర్షం కురిసింది. ముల్కలపేటకు వెళ్లే మార్గం లో ఉన్న బద్వేల్‌ వాగు ఉప్పొంగి ప్రవహించడంతో నాలుగు గంటలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. నీల్వాయి, చెన్నూరుకు వెళ్లే ప్రయాణికులు వాగు దాటడానికి ఇబ్బందులుపడ్డారు. వంతెన నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. 


బెల్లంపల్లిటౌన్‌ : పట్టణంలోని 28వ వార్డు హనుమాన్‌ బస్తీ, శ్రీ వెంకటేశ్వర్‌ కాలనీలో, పట్టణంలో భారీ వర్షానికి ఇండ్లలోకి వరద నీరు చేరింది. విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్‌, బీజేపీ నాయకుడు రాజులాల్‌ యాదవ్‌, నాయకులు గాండ్ల మహేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఆకుల వెంకటేష్‌కు సమాచా రం అందించారు. అక్కడకు చేరుకున్న కమిషనర్‌, శానిటరి ఇన్స్‌పెక్టర్‌ సుధాకర్‌ లు సహాయక చర్యలు చేపట్టారు. 


మందమర్రిటౌన్‌:  మందమర్రి మండలంలో భారీ వర్షం కురిసింది.  వాగులు, వంకలు ఉప్పొంగాయి. పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.   రామాలయం మూడోజోన్‌, రామన్‌ కాలనీ, చెంచు కాలనీలతోపాటు పలు కాల నీల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  చిర్రకుంట, ఆదిల్‌పేట, పొ న్నారంలలో రోడ్‌ డ్యాంలపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు అం తరాయం ఏర్పడింది. 

Updated Date - 2020-09-26T11:06:47+05:30 IST