Abn logo
Sep 27 2021 @ 22:45PM

పలు మండలాల్లో భారీ వర్షం

చింతలమానేపల్లిలో నీట మునిగిన పత్తి చేను

చింతలమానేపల్లి, సెప్టెంబరు 27: మండలంలో సోమవారం కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. మండలంలోని కర్జేల్లి, గంగాపూర్‌, చింతలమానేపల్లి శివార్లలో సాగుచేస్తున్న పత్తిపంట సుమారు 80 ఎక రాల్లో నేలకొరిగింది. పత్తి పంట కాత, పూత దశలో ఉండడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

జైనూరు: మండలంలో సోమవారం భారీవర్షం కురిసింది. దీంతో రైతులు పంటపొలాలకు వెళ్లలేక పోయారు. అదేవిధంగా వాగుపరివాహక ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. చింతకర్ర, కిషన్‌నాయక్‌ తండా, అడ్డేసర్‌, లొద్దిగూడ తదితర గ్రామాల సమీ పంలో వాగులు ఉప్పొంగ డంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కారణంగా పంటలు నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. 

బెజ్జూరు: మండలంలో సోమవారం మధ్యాహ్నం ఏకదాటిగా ముసురు వాన కురిసింది.ఈ కారణంగా గ్రామాల రోడ్లు బురదమయంగా మారాయి.

దహెగాం: మండలంలో సోమవారం ఎడతెరిపి లేకుండా భారీవర్షం కురిసింది. వర్షం కారణంగా చేతి కందిన పత్తిపంట నష్టపోయే అవకాశం ఉందని, కాయలు కుల్లిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. కాగా భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధి కారులు హెచ్చరించారు. 

పెంచికలపేట: మండల వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి ఏకదాటిగా ముసురు కురిసింది. వర్షం కారణంగా పత్తిపంటకు దోమపోటు బెడద ఎక్కువ అవుతుందని రైతులు ఆందోళన చెందుతు న్నారు. విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల రోడ్లు బురదమయంగా తయారయ్యాయి.

సిర్పూర్‌(యూ): మండలంలో సోమవారం భారీ వర్షం పడింది. ఆదివారం రాత్రి నుంచి ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కుడిన భారీ వర్షం కురిసింది. సోమవారం మధ్యాహ్నం నుంచి వాన పడుతూనే ఉంది. వాగులు,వంకలు భారీ వర్షానికి పొంగి ప్రవహిస్తున్నాయి. దేవుడుపల్లి వాగుకు వరద రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద నీటిలో వాగులు దాటవద్దని అధికారులు ప్రజలకు సూచించారు.