మన్యంలో భారీ వర్షం

ABN , First Publish Date - 2021-05-11T05:11:43+05:30 IST

ఏజెన్సీలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయత్రం మూడు గంటల వరకు ఎండ తీవ్రంగా కాసింది.

మన్యంలో భారీ వర్షం
పాడేరు మోదకొండమ్మ ఆలయం సమీపంలో వర్షం

 

పాడేరు, మే 10: ఏజెన్సీలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయత్రం మూడు గంటల వరకు ఎండ తీవ్రంగా కాసింది. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. ఉరుములు, పిడుగులతో వర్షం కురవడంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. అలాగే పలు చోట్ల వడగళ్లు సైతం పడ్డాయి. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని రోజులుగా ఏజెన్సీలో విభిన్నమైన వాతావరణం నెలకొంటున్నది. ఉదయం వేళలో మంచు కురవడం, మధ్యాహ్నం ఎండ కాయడం, ఆ తర్వాత భారీ వర్షం కురవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. అలాగే జి.మాడుగుల, హుకుంపేట, డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు మండలాల్లో భారీగా వర్షం గంటన్నర సమయం కురవగా.. ఆ తర్వాత సాధారణ వాతావరణం నెలకొంది. తాజా వర్షాలు  వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంటాయని గిరి రైతులు అంటున్నారు. 

Updated Date - 2021-05-11T05:11:43+05:30 IST