జిల్లాలో భారీ వర్షం

ABN , First Publish Date - 2021-06-11T04:53:32+05:30 IST

జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు దోమకొండ, మద్నూర్‌, జుక్కల్‌, ఎల్లారెడ్డి, బాన్సువాడ, నిజాంసాగర్‌, లింగంపేట, పెద్దకొడప్‌గల్‌ తదితర మండలాల్లో వర్షం కురిసింది.

జిల్లాలో భారీ వర్షం
దోమకొండలో కురిసిన వర్షానికి పొలాల్లోకి చేరిన నీరు

కామారెడ్డి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు దోమకొండ, మద్నూర్‌, జుక్కల్‌, ఎల్లారెడ్డి, బాన్సువాడ, నిజాంసాగర్‌, లింగంపేట, పెద్దకొడప్‌గల్‌ తదితర మండలాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతంగా ఉంది. జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం నుంచి వర్షం మొదలైంది. దాదా పు రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షంపడడంతో రోడ్లన్నీ జలమయం అయి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలె త్తాయి. ప్రధాన రహదారుల్లో సైతం భారీగా వర్షపు నీరు చేరి ంది. అయితే గత రెండు రోజులుగా వర్షాలు పడుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతన్నలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
ఎల్లారెడ్డిలో..
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలో కురిసిన భారీ వర్షానికి రోడ్ల న్నీ జలమయం అయ్యాయి. మురికి కాలువల్లో చెత్త పేరుక పోవడంతో నీరంతా రోడ్లపైకి వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతా ల్లో ఉన్న ప్రజల ఇళ్లలోకి నీరు వెళ్లి తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొన్నారు. ఇక మిషన్‌భగీరథ పైప్‌లైన్‌లు ఇష్టం వచ్చినట్లు తవ్వకం చేపట్టడంతో గుంతలు ఏర్పడి వాహనదారులు అదుపుతప్పి పడిపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికా రులు స్పందించి నీరు నిల్వకుండా చూడాలన్నారు.
దోమకొండలో..
దోమకొండ: గురువారం తెల్లవారు జాము నుంచి భారీ వర్షం కురియడంతో మళ్లలో నీరు నిలిచింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మండలంలో ఒక మోస్తరు వర్షం కురిసింది. వానాకాలం ప్రారంభంలోనే వర్షాలు కురియడంతో రైతులు పంటలు వేసేందుకు దుక్కులు దున్నుతున్నారు.  
ఐలాపూర్‌లో విద్యుదాఘాతంతో గొర్రె మృతి
లింగంపేట: మండలంలోని ఐలాపూర్‌లో గురువారం విద్యుదాఘాతంతో మామిడి చిన్నోల్ల రాజయ్యకు చెందిన గొర్రె మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గొర్రెల మంద మేత కు వెళ్లి వస్తుండగా గ్రామ సమీపంలో స్తంభానికి ఏర్పాటు చేసిన సపోర్టింగ్‌ వైరుకు విద్యుత్‌ ప్రవాహం జరిగి మృతి చెందినట్లు వారు తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ సపోర్టింగ్‌ తీగను తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
జుక్కల్‌లో..
జుక్కల్‌: మండలంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. వాతా వరణం చల్లగా ఉండటంతో పాటు వర్షాకాలం ప్రారంభం నుంచే ప్రతీరోజు వర్షాలు కురుస్తుండటంతో రైతన్నలు ఖరీఫ్‌ సాగుకు పూర్తిస్థాయిలో సమాయాత్తం అవుతున్నారు. ఎరు వులు, విత్తనాలు సిద్ధం చేసి ఉంచగా, మరిన్ని భారీ వర్షాలు కురిస్తే విత్తనాలు అలుకుతామని పలువురు రైతన్నలు తెలిపా రు. మృగశిర కార్తెలో వర్షాలు కురుస్తుండటంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిజాంసాగర్‌లో..
నిజాంసాగర్‌ : మండల కేంద్రంలో గురువారం సాయం త్రం భారీ వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటలకు ప్రారం భమైన వర్షం 5.30గంటల వరకు ఎడతెరపి లేకుండా కురిసిం ది. మండల కేంద్రంలో భారీ వర్షం కురియడంతో మురికి కాల్వలు పొంగి పొర్లాయి. మృగశిర కార్తె రెండో రోజు వర్షం కురియడంతో రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. మరో వారం రోజుల్లోగా వాణిజ్య పంటలు వేసుకునేందుకు రైతులు సమా యాత్తం అవుతున్నారు.
పెద్ద కొడప్‌గల్‌లో..
పెద్ద కొడప్‌గల్‌: మండలంలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన వర్షం ఎడతెరపి లేకుండా కురియడంతో రహ దారులపై, మురికి కాల్వల్లో నీరు పొంగి పొర్లాయి. మండలం లో గురువారం కురిసిన వర్షం 58మిల్లీ మీటర్లుగా నమోదైన ట్లు తహసీల్దార్‌ సాయి భుజంగరావు తెలిపారు.
బాన్సువాడ డివిజన్‌లో..
బాన్సువాడ: బాన్సువాడ డివిజన్‌ వ్యాప్తంగా గురువారం సాయంత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. డివిజ న్‌లోని మద్నూర్‌, బిచ్కుంద, జుక్కల్‌, పెద్దకొడప్‌గల్‌, పిట్లం, నిజాంసాగర్‌, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌, బాన్సువాడ మండలా ల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. మృగశిర కార్తె మరుసటి రోజు భారీ వర్షం కురియడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షానికి రహదారులపై నీరు పొంగి పొర్లగా, మురికి కాల్వల్లో నీరు ప్రవహించింది. ఉదయం నుంచే వాతావరణం చల్లగా ఉండగా, సాయంత్రం వేళల్లో ఒక్కసారిగా ఆకాశం మేఘావృత్తమై భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో రైతులు వానాకాలం సాగుకు సమాయాత్తం అవుతున్నారు.

Updated Date - 2021-06-11T04:53:32+05:30 IST