Advertisement
Advertisement
Abn logo
Advertisement

వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు బాలుడు మృతి

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ఇద్దరు మరణించారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ వంటి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడి వర్షం కురిసింది. రోడ్లన్నీ వర్షానికి జలమయం అయ్యాయి. అయితే కర్ఫ్యూ ఆంక్షల వల్ల ప్రజలు బయటకు రాకపోవడంతో ట్రాఫిక్ సమస్య ఎదురుకాలేదు. కృష్ణా జిల్లా ముస్తాబాద శివారు వ్యవసాయ క్షేత్రంలో నరసింహరావు అనే రైతు ట్రాక్టర్‌తో  బ్లేడ్ వేస్తున్న సమయంలో పిడుగుపడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. అలాగే  ముసునూరులో పిడుగు పాటుకు కొప్పుల హరికృష్ణ అనే బాలుడు మృతి చెందాడు. పొలం నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 11 ఏళ్ల బాలుడు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదచ్చాయలు అలుముకున్నాయి. నిడమానూరు గ్రామంలో పిడుగుపాటుకు ఐదేళ్ల పాపకు స్వల్ప గాయాలు అయ్యాయి.


మరోవైపు గన్నవరం మండలం, టేంపల్లి పంట పొలంలో పిడుగుపడి తాటిచెట్టు దగ్ధమైంది. ఏలూరులో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ప్రభావానికి నగరంలో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. కొన్నిచోట్ల విద్యుత్ వైర్లపై చెట్లు కూలిపోయాయి. దీంతో ముందుజాగ్రత్త చర్యగా నగరంలో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. భారీ వర్షంవల్ల పలురోడ్లు జలమయమయ్యాయి. విశాఖ ఏజెన్సీలో పిడుగుపాటుకు పశువులు మృతిచెందగా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో 13 ఆవులు చనిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement