Abn logo
Aug 5 2020 @ 03:26AM

బలపడిన అల్పపీడనం!

అమరావతి,విశాఖపట్నం, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి):  పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉత్తరబంగాళాఖాతంలో మంగళవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం బలపడింది. మంగళవారం రాత్రికి పశ్చిమంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా మారి పశ్చిమబెంగాల్‌, ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా 7.6కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం నెలకుంది. దీనివల్ల నైరుతీ రుతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయి. దీనివల్ల రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఈ నెల 8న ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది. 

Advertisement
Advertisement
Advertisement