వాన ఆగినా వరద తగ్గలేదు

ABN , First Publish Date - 2021-12-01T14:01:14+05:30 IST

రాజధానిని వర్షం వీడినా వరద మాత్రం వదలనంటోంది. నగరంలో మంగళవారం వేకువజాము నుంచి సాయంత్రం వరకూ వర్షం ఆగినా రహదారులు, పల్లపు ప్రాంతాలు, సబర్బన్‌ ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే

వాన ఆగినా వరద తగ్గలేదు

చెన్నై: రాజధానిని వర్షం వీడినా వరద మాత్రం వదలనంటోంది. నగరంలో మంగళవారం వేకువజాము నుంచి సాయంత్రం వరకూ వర్షం ఆగినా రహదారులు, పల్లపు ప్రాంతాలు, సబర్బన్‌ ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ప్రధాన రహదారిపై వర్షపునీరు ఇంకా వరదలా ప్రవహిస్తూనే ఉంది. వెస్ట్‌మాంబళం, కేకేనగర్‌, టి.నగర్‌ సహా పలు ప్రాంతాల్లో రహదారుల్లో అడుగులోతు వర్షపునీరు ప్రవహిస్తోంది. తాంబరం ముడిచ్చూరులోని జననివాస ప్రాంతాల చుట్టూ అడుగులోతు వర్షపునీరు పారుతోంది. నగరంలోని మెరీనాబీచ్‌లో సర్వీసు రోడ్డు వరకు ఇసుక తిన్నెలు కనిపించకుండా వర్షపునీరు ప్రవహిస్తోంది. మాంబళం- రంరాజపురం మధ్య సబ్‌వేలో వర్షపునీరు ప్రవహిస్తుండటంతో వారంరోజులుగా వాహనాల రాకపోకలు నిలిపివేశారు. టి.నగర్‌ మ్యాడ్లీ సబ్‌వేలో వర్షపునీరు ఇంకా తొలగలేదు.  నార్త్‌ ఉస్మాన్‌ రోడ్డు, వివేక్‌ కూడలి వద్ద వర్షపునీరు వరదలా ప్రవహిస్తోంది. కేకేనగర్‌ రాజమన్నార్‌ రోడ్డులో వర్షపునీరు ప్రవహిస్తున్న కారణంగా ఆ రహదారిలో రాకపోకలు నిలిపి వేశారు. వలసరవాక్కం మెగామార్ట్‌ రోడ్డులోనూ ఇదే పరిస్థితి కొన సాగుతోంది. అశోక్‌నగర్‌ పోస్టల్‌ కాలనీ రహదారిలో వర్షపునీరు ఇంకా తొలగలేదు.

Updated Date - 2021-12-01T14:01:14+05:30 IST