Abn logo
Sep 26 2021 @ 15:33PM

ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు

అమరావతి: వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గులాబ్‌ తుఫాన్‌ కొనసాగుతోంది. గోపాలపూర్‌కు 140 కిలోమీటర్లు, కళింగపట్నానికి 190 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోందని అధికారులు ప్రకటించారు. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంధ్రలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను తరలించారు. బారువ తీర ప్రాంత గ్రామాల్లో ఎస్పీ అమిత్ బర్దార్ పర్యటించారు. జిల్లాలో 75 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...