బెంగాల్‌లో భారీవర్షాలు..విరిగిపడిన కొండచరియలు

ABN , First Publish Date - 2020-09-24T15:15:46+05:30 IST

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో 10వనంబరు,31వ నంబరు జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.....

బెంగాల్‌లో భారీవర్షాలు..విరిగిపడిన కొండచరియలు

 సిక్కిం-సిలిగురి, డార్జిలింగ్ జాతీయ రహదారుల బంద్

సిలిగురి (పశ్చిమబెంగాల్): పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో 10వనంబరు,31వ నంబరు జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.గత వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో సిలిగురి-సిక్కిం 10వ నంబరు జాతీయ రహదారిపై పలు చోట్ల కొండచరియలు విరిగి రోడ్డుపై పడ్డాయి. సిలిగురి- డార్జిలింగ్, సిలిగురి-సిక్కిం మార్గాల్లోని రోడ్లపై పలు చోట్ల ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి.దీంతో రోడ్లను మూసివేశారు. 


పశ్చిమబెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర ప్రాంతాల్లో బుధవారం భారీవర్షాలు కురిశాయి.శుక్రవారం వరకు బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణకేంద్రం అధికారులు చెప్పారు. డార్జిలింగ్, కలీంపొంగ్ జిల్లాల్లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.డార్జిలింగ్, కలింపొంగ్, జల్పాయ్ గురి, అలీపూర్దౌర్, కోచ్ బెహార్ ప్రాంతాల్లోని లోతట్టుప్రాంతాల్లో వరదనీరు నిలిచింది. మాల్దా, నార్త్ దినజ్ పూర్, సౌత్ దినజ్ పూర్ ప్రాంతాల్లో ఈ నెల 25వతేదీ వరకు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణకేంద్రం అధికారులు చెప్పారు. 

Updated Date - 2020-09-24T15:15:46+05:30 IST