చైనాను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

ABN , First Publish Date - 2020-07-08T18:32:03+05:30 IST

భారీ వర్షాలు చైనాను ముంచెత్తుతున్నాయి.

చైనాను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

బీజింగ్: భారీ వర్షాలు చైనాను ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు పోటెత్తాయి. రోడ్లన్నీ జలమయ మయ్యాయి. గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి. వూహాన్ సిటీ, గూయిజ్‌హౌ ప్రావిన్సు, సెంట్రల్ చైనాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చైనాలోని తూర్పు అన్హీయు ప్రావిన్సులో కుండపోత వర్షాలతో జనజీవనం అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా రిస్క్యూ సిబ్బందిని ప్రభుత్వం రంగంలోకి దింపింది. దీంతో 4 లక్షల 24వేల మందిని ఆ ప్రాంతం నుంచి తరలించారు. హోంగ్ షాన్‌లోని వెయ్యిమందిని సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లారు. స్కూల్స్, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అలాగే మంగళవారం నుంచి జరగాల్సిన పరీక్షలను రద్దు చేసింది. పరీక్షలకు సంబంధించి కొత్త తేదీని ప్రకటిస్తామంది. మరోవైపు ముంపు ఉన్న ప్రాంతాలను గుర్తించి జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Updated Date - 2020-07-08T18:32:03+05:30 IST