చీరాలలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం

ABN , First Publish Date - 2021-11-20T19:16:22+05:30 IST

చీరాలలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

చీరాలలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం

ప్రకాశం జిల్లా: చీరాలలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వైకుంఠపురం, శ్రీరామనగర్, దండుబాట, విఠల్‌నగర్ ప్రాంతాలలో వర్షపు నీరు నిలిచింది. ఇళ్ళ మధ్య రహదారులపై వర్షపునీరు నిలవడంతో స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్లల్లోకి చేరిన వర్షపు నీటిని తోడి బయట పోస్తున్నారు. ఆధికారులు స్పందించి వరదనీటిని బయటకు పంపే చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2021-11-20T19:16:22+05:30 IST