Abn logo
Sep 27 2021 @ 14:14PM

భారీ వర్షాల వల్ల అప్రమత్తంగా ఉండండి: కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల పరిస్థితులను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో సమీక్షించారు. గులాబీ తూఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయని, ఈ పరిస్థితుల్లో ఏవిధమైన, ప్రాణ ఆస్తి నష్టం కలగా కుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలీస్, రెవిన్యూ తదితర శాఖలు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మరోసారి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో సీఎస్‌తో పాటు  డీజీపీ మహేందర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి  సందీప్ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ లు కూడా పాల్గొన్నారు.

      

ఇవి కూడా చదవండిImage Caption