ఈశాన్య రాష్ట్రాల్లో భారీవర్షాలు..ఐఎండీ హెచ్చరిక

ABN , First Publish Date - 2020-10-24T15:32:10+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బంగ్లాదేశ్ ఖేవుపారా, పశ్చిమబెంగాల్ వద్ద తీరం దాటడంతో వచ్చే 12 గంటల్లో శనివారం పలు ఈశాన్య రాష్ట్రాల్లో భారీవర్షాలు...

ఈశాన్య రాష్ట్రాల్లో భారీవర్షాలు..ఐఎండీ హెచ్చరిక

న్యూఢిల్లీ :బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బంగ్లాదేశ్ ఖేవుపారా, పశ్చిమబెంగాల్ వద్ద తీరం దాటడంతో వచ్చే 12 గంటల్లో శనివారం పలు ఈశాన్య రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని కేంద్ర  వాతావరణశాఖ తాజాగా హెచ్చరించింది. శనివారం  కేంద్ర  వాతావరణశాఖ (ఐఎండీ) విడుదల చేసిన బులిటిన్ లో దక్షిణ అసోం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది.ఈశాన్య రాష్ట్రాల్లో భారీవర్షాల వల్ల వాయుగుండం తీరం దాటడం వల్ల బంగాళాఖాతంలో రాగల 12 గంటల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల  వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. ఢిల్లీ, గుర్గావ్, ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్ నగరాల్లో గాలిలో కాలుష్యం పెరిగింది. 

Updated Date - 2020-10-24T15:32:10+05:30 IST