కోస్తాకు భారీ వర్షాలు

ABN , First Publish Date - 2020-09-21T07:47:37+05:30 IST

ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24

కోస్తాకు భారీ వర్షాలు

విశాఖపట్నం/అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుంది. అలాగే, ఉత్తరాంధ్ర పరిసరాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తనం బలహీన పడింది.

ఈ ప్రభావంతో ఆదివారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. సోమవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, అనేకచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.  


Updated Date - 2020-09-21T07:47:37+05:30 IST