Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 2 2021 @ 10:38AM

వరద ప్రభావిత ప్రాంతాల్లో పొంచివున్న అంటువ్యాధులు

- మురుగు నీటితో బెంబేలెత్తుతున్న ప్రజలు

- నివారణ చర్యల్లో కార్పొరేషన్‌ సిబ్బంది


చెన్నై: పది రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో వరదనీరు నిలిచివుండడం, ఎటు చూసినా మురుగునీరు పారు తుండడంతో అంటు వ్యాధులు ప్రబలే అవకాశముందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నగర కార్పొరేషన్‌ అధికారులు హూటాహూటిన వరద నీరు, మురుగునీటిని తొలగించేందు కు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. 

వాననీటిని మోటారు పంపులతో యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నప్పటికీ నగరంలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. రెండు రోజులు గా వర్షం లేకపోయినప్పటికీ సెమ్మంజేరి, ఓఎమ్మార్‌, ముట్టుకాడు, తాళం బూరు, తిరుప్పోరూరు, వెస్ట్‌మాంబళం, కోయంబేడు, మధురవాయల్‌, అరుంబాక్కం, పుళల్‌, మనలి పుదునగర్‌ తదితర ప్రాంతాల్లోని జనా వాసాల్లో వరదనీరు ఇంకా ప్రవహిస్తూనే వుంది. పాతమహాబలిపురం రోడ్డు లోని పడూరు, సెమ్మంజేరి తదితర ప్రాంతాల్లో వర్షపునీరు అడుగులోతున ప్రవహిస్తూనే ఉంది. తిరుప్పోరూరు ప్రాంతంలో 40 చెరువులు నీటితో నిండి పొంగి ప్రవహిస్తున్నాయి. సుమారు ఐదువేలకు పైగా ఇళ్లలో వర్షపునీరు ప్రవహిస్తోంది. ఎంజీఆర్‌ నగర్‌ ప్రాంతంలోని నెసపాక్కం, తిరువళ్లువర్‌ రహదారి తదితర ప్రాంతాల్లోనూ రహదారులపై వర్షపునీరు ఇంకా తొలగలేదు. కోయంబేడు న్యూ కాలనీ, కేకేనగర్‌ రాజమన్నార్‌ రోడ్డు, వలసరవాక్కం, ఆర్కాట్‌ రోడ్డు, ఆఫీసర్స్‌ కాలనీ తదితర ప్రాంతాలు కూడా జలదిగ్బంధంలో ఉన్నాయి. అరుంబాక్కం కూవం నది ఒడ్డున ఉన్న ప్రాంతాల్లో మురుగునీరు, వర్షపునీరు కలిసి ప్రవహిస్తున్నాయి


డెంగ్యూ జ్వరాల భయం!

నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపునీరు వారం రోజులకు పైగా ప్రవహిస్తుండడంతో ఆ ప్రాంతాల్లో డెంగ్యూ జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.  

Advertisement
Advertisement