విశాఖ పోర్టులోకి భారీ నౌక

ABN , First Publish Date - 2020-12-01T09:05:47+05:30 IST

విశాఖపట్నం పోర్టులోకి సోమవారం భారీ కార్గో నౌక ‘డబ్ల్యూ ఓస్లో’ ప్రవేశించింది. ఇప్పటివరకు 32.5 మీటర్ల బీమ్‌ కలిగిన నౌకలను

విశాఖ పోర్టులోకి భారీ నౌక

విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి: విశాఖపట్నం పోర్టులోకి సోమవారం భారీ కార్గో నౌక ‘డబ్ల్యూ ఓస్లో’ ప్రవేశించింది. ఇప్పటివరకు 32.5 మీటర్ల బీమ్‌ కలిగిన నౌకలను మాత్రమే ఇన్నర్‌ హార్బర్‌లోకి అనుమతించేవారు. సింగపూర్‌లో స్టిమ్యులేషన్‌ టెక్నాలజీని అధ్యయనం చేశాక.. 38 మీటర్ల వెడల్పు బీమ్‌ కలిగిన డబ్ల్యూ ఓస్లో నౌకను సునాయాసంగా లోపలకు తీసుకొచ్చారు. దక్షిణాఫ్రికాలోని రిచర్డ్‌ బే పోర్టు నుంచి వచ్చిన ఈ నౌక పొడవు 229.2 మీటర్లు. విశాఖలోని శారదా మెటల్స్‌ గ్రూపు కంపెనీలకు 27,029 టన్నుల మినరల్స్‌, 87,529 టన్నుల స్టీమ్‌ కోల్‌ను ఈ నౌక తీసుకొచ్చింది.

Updated Date - 2020-12-01T09:05:47+05:30 IST