మంచు ముసుగు

ABN , First Publish Date - 2022-01-22T05:26:29+05:30 IST

శ్రీవారి క్షేత్రంపై శుక్రవారం తెల్లవారుజామున కురిసిన మంచు రమణీయ దృశ్యాలను ఆవిష్కరించింది.

మంచు ముసుగు
ద్వారకాతిరుమల జంట గోపురాలపై మంచు ముసుగు

ద్వారకాతిరుమల, జనవరి 21: శ్రీవారి క్షేత్రంపై శుక్రవారం తెల్లవారుజామున కురిసిన మంచు రమణీయ దృశ్యాలను ఆవిష్కరించింది. మంచు పరదాలో శ్రీవారి క్షేత్ర పరిసరాలు, శేషాచలకొండపై రహదారులు కనిపించక భక్తులు ఇబ్బందులు పడ్డారు. వాహనాలు లైట్ల ఆధారంగా కొండపైకి చేరుకున్నాయి.




బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో మంచు తీవ్రతకు పచ్చని పర్వతాలు కూడా కనుమరుగయ్యాయి. తెల్లవారుజాము నుంచి ఉన్న మంచు ప్రభావం 10 గంటల వరకు కొనసాగింది. పక్కనే ఉన్నవారు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో మంచు కురవడం ఇదే తొలిసారి.

Updated Date - 2022-01-22T05:26:29+05:30 IST