ఉద్దేశపూర్వకంగా కరోనాను వ్యాపింప చేస్తే.. 5 ఏళ్ల జైలు.. రూ. 20 ల‌క్ష‌ల జ‌రిమానా

ABN , First Publish Date - 2020-04-02T20:27:41+05:30 IST

యూఏఈలో ఉద్దేశపూర్వకంగా కరోనావైరస్ వ్యాప్తి చేయడానికి ప్రయత్నించే వారికి 1,00,000 దిర్హామ్స్ (సుమారు రూ .20 లక్షలు) జ‌రిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధించ‌బ‌డుతుందని అక్క‌డి అధికారులు తెలిపారు.

ఉద్దేశపూర్వకంగా కరోనాను వ్యాపింప చేస్తే.. 5 ఏళ్ల జైలు.. రూ. 20 ల‌క్ష‌ల జ‌రిమానా

యూఏఈ: యూఏఈలో ఉద్దేశపూర్వకంగా కరోనావైరస్ వ్యాప్తి చేయడానికి ప్రయత్నించే వారికి 1,00,000 దిర్హామ్స్ (సుమారు రూ .20 లక్షలు) జ‌రిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధించ‌బ‌డుతుందని అక్క‌డి అధికారులు తెలిపారు. అలాగే క‌రోనా వైర‌స్ సోకిన‌వాళ్లు ఆరోగ్య‌శాఖ అధికారుల‌కు స‌మాచారం ఇవ్వ‌క‌పోతే కూడా రూ. 20 ల‌క్ష‌ల జ‌రిమానాతో పాటు మూడేళ్లు క‌ట‌క‌టాల వెన‌క్కి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ రెండోసారి కూడా ఇలాంటి త‌ప్పే చేస్తే శిక్ష డ‌బుల్ అవుతుంద‌ని అధికారులు వెల్ల‌డించారు. అంటువ్యాధులకు సంబంధించి 2014లో తీసుకొచ్చిన‌ ఫెడరల్ చ‌ట్టం ప్రకారం ఈ జరిమానా, జైలు శిక్షను విధిస్తోంది యూఏఈ ప్ర‌భుత్వం. ఇక యూఏఈలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగానే ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు 814 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ఎనిమిది మంది మృతి చెందారు. 

Updated Date - 2020-04-02T20:27:41+05:30 IST