Abn logo
Apr 18 2021 @ 00:00AM

‘హ్యారీ పోటర్‌’నటి హెలెన్‌ మృతి

హాలీవుడ్‌ నటి హెలెన్‌ మెక్‌క్రరీ ఇకలేరు. క్యాన్సర్‌ కారణంగా మృతి చెందినట్టు శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు(భారత కాలమానం ప్రకారం) ఆమె భర్త డేమియన్‌ లూయిస్‌ ట్వీట్‌ చేశారు. ‘హ్యారీ పోటర్‌’ సినీ అభిమానులు నాసిస మాల్‌ఫోయ్‌గా హెలెన్‌ను గుర్తుంచుకుంటారు. ఆ పాత్ర ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. ‘హ్యారీ పోటర్‌’ ఫ్రాంఛైజీలో ‘హాఫ్‌ బ్లడ్‌ ప్రిన్స్‌’లో తొలుత మాల్‌ఫోయ్‌గా హెలెన్‌ కనిపించారు. తర్వాత ‘డెత్‌ హాలోస్‌’లోనూ ఆమె పాత్ర కొనసాగింది. ‘ద క్వీన్‌’ (2006)లో మాజీ యూకే ప్రధాని టోనీ బ్లెయిర్‌ భార్య చెర్లి పాత్రలో నటించారు. జేమ్స్‌ బాండ్‌ చిత్రం ‘స్కై ఫాల్‌’, ‘పీకీ బైండ్లర్స్‌’, ‘హ్యూగో’ తదితర చిత్రాలతో పాటు బుల్లితెరపై కొన్ని పాత్రలూ చేశారు.