నరకదారి

ABN , First Publish Date - 2021-11-30T06:45:38+05:30 IST

అది ఒంగోలు-నంద్యాల రహదారి. అందులో చీమకుర్తి నుంచి పొదిలి వరకూ ఉన్న రోడ్డు అధ్వానంగా మారింది. అడుగుకో గతుకు.. గజానికో గొయ్యి దర్శనమిస్తోంది. చీమకుర్తికి పడమర వైపు నుంచి రామతీర్థం వరకు ఉన్న 4 కిలోమీటర్ల దూరంలో 3 కిలో మీటర్లు, ఆ తర్వాత మర్రిచెట్లపాలెం వరకూ ఉన్న 5కిలో మీటర్లలో 4కిలో మీటర్ల మేర తారు రోడ్డు ఆనవాళ్లు లేకుండా పోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు బురదమయంగా మారింది

నరకదారి
బురద బురదగా మారిన చీమకుర్తి బైపాస్‌ రోడ్డు

 అడుగుకో గతుకు.. గజానికో గుంత!

అధ్వానంగా ఒంగోలు-నంద్యాల రహదారి 

చీమకుర్తి నుంచి పొదిలి వరకూ ప్రయాణం నరకం


ఆంధ్రజ్యోతి ఒంగోలు 

అది ఒంగోలు-నంద్యాల రహదారి. అందులో  చీమకుర్తి నుంచి పొదిలి వరకూ ఉన్న రోడ్డు అధ్వానంగా మారింది. అడుగుకో గతుకు.. గజానికో గొయ్యి దర్శనమిస్తోంది. చీమకుర్తికి పడమర వైపు నుంచి రామతీర్థం వరకు ఉన్న 4 కిలోమీటర్ల దూరంలో 3 కిలో మీటర్లు, ఆ తర్వాత మర్రిచెట్లపాలెం వరకూ ఉన్న 5కిలో మీటర్లలో 4కిలో మీటర్ల మేర తారు రోడ్డు ఆనవాళ్లు లేకుండా పోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు బురదమయంగా మారింది. దీంతో ఈ రోడ్డులో ప్రయాణించే వారు నరక యాతనపడుతున్నారు. ఇక కార్లు, బైక్‌లపై వెళ్లే వారి అవస్థలు వర్ణణాతీతమయ్యాయి. మర్రిచెట్లపాలెం అవతల ఉన్న ముసి నుంచి పొదిలి వరకు 16 గుంతలున్నాయి. ఈ రోడ్డుపై ప్రయాణం ప్రాణాంతకంగా మారగా, కార్లు, బైక్‌లు అయితే పూర్తిగా దెబ్బతినిపోతున్నాయి. నిత్యం ప్రమాదాలూ జరుగుతున్నాయి. అద్దెకార్ల యజమానులు రెండింతలు అద్దె ఇచ్చినా ఆ రహదారిపై ప్రయాణానికి రామంటే రాము అని తెగేసి చెప్తున్నారు. రోడ్డు బాగా ఉంటే ఒంగోలు నుంచి పొదిలికి గంటల్లో వెళ్లొచ్చు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో రెండు గంటలపైనే పడుతోంది.  జిల్లాలో రోడ్ల దుస్థితి ఏరకంగా ఉందనేందుకు ఇది దర్పణం పడుతోంది. 





Updated Date - 2021-11-30T06:45:38+05:30 IST