Helmet‌ లేదు.. Masks లేవు.. చేతిలో మద్యం సీసాలు

ABN , First Publish Date - 2021-12-12T15:30:39+05:30 IST

బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌-14లో రెండు ద్విచక్ర వాహనాలపై నలుగురు వ్యక్తులు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రయాణించారు. హెల్మెట్‌ పెట్టుకోకుండా మాస్కు ధరించకుండా

Helmet‌ లేదు.. Masks లేవు.. చేతిలో మద్యం సీసాలు

‘హిల్స్‌’ లో ఏం జరుగుతోంది..

హైదరాబాద్/బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌-14లో రెండు ద్విచక్ర వాహనాలపై నలుగురు వ్యక్తులు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రయాణించారు. హెల్మెట్‌ పెట్టుకోకుండా మాస్కు ధరించకుండా మద్యం సీసాలతో రోడ్లపై యథేచ్ఛగా ప్రయాణించారు. ఈ వ్యవహారాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. అది చక్కర్లు కొడుతూ పోలీసులకు చేరింది. ద్విచక్ర వాహనాల నెంబర్ల ద్వారా మద్యం సీసాలతో తిరుగుతున్న వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు ఆరంభించారు. 


మద్యం మత్తులో దాడికి యత్నం

మద్యంమత్తులో ఆటో డ్రైవర్‌ హల్‌చల్‌ చేశాడు. ఓ ఆటో డ్రైవర్‌ పీకల దాకా మద్యం తాగి జూబ్లీహిల్స్‌ నుంచి బంజారాహిల్స్‌ అన్నపూర్ణ స్టూడియో వైపు వస్తూ ఓ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో అతని ఆటో కూడా బోల్తా పడింది. మత్తులోనున్న ఆటోడ్రైవర్‌ ద్విచక్ర వాహనదారుడిపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత ఆటోడ్రైవర్‌ పారిపోతుండగా స్థానికులు అతన్ని పట్టుకున్నారు. వారిపట్ల కూడా ఆటోడ్రైవర్‌ దురుసుగా ప్రవర్తించడంతో స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి బంజారాహిల్స్‌ పోలీసులకు అప్పగించారు.

Updated Date - 2021-12-12T15:30:39+05:30 IST