బాలుడిని ఆదుకోరూ...!

ABN , First Publish Date - 2020-06-05T10:52:12+05:30 IST

జన్నారం మండలం లోని చెర్లపల్లెకు చెం దిన గోదాడ లక్ష్మణ్‌ రజితల కుమారుడు తేజాన్స్‌ (3) మూడే ళ్ళుగా కాలేయ

బాలుడిని ఆదుకోరూ...!

కాలేయ మార్పిడికి రూ.30 లక్షల ఖర్చవుతుందని వైద్యుల వెల్లడి

ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు


జన్నారం, జూన్‌ 4: జన్నారం మండలం లోని చెర్లపల్లెకు చెం దిన గోదాడ లక్ష్మణ్‌ రజితల కుమారుడు తేజాన్స్‌ (3) మూడే ళ్ళుగా కాలేయ వ్యాధితో బాధ పడుతున్నాడు. పుట్టిన మూడు నెలలకే కాలేయ వ్యాధితో ఇబ్బంది పడటం తో  డాక్టర్లు తాత్కాలికంగా ఆపరేషన్‌ చేశారు. అయితే ఇప్పుడు పూర్తిగా చెడిపో వడంతో కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు పేర్కొన్నారు. సుమారు రూ.30 లక్షలకు పైగా ఖర్చవుతుందని అక్కడి వైద్యులు తెలిపారు. తండ్రి ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్ళగా రజిత బాబును పట్టుకొని ఆసుపత్రుల వెంట అష్టకష్టాలు పడుతోంది. హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆసుపత్రిలో ఆపరేషన్‌ చేద్దామని వైద్యులు ముందుకు వచ్చినా బ్లడ్‌ గ్రూప్‌ ఓ నెగెటివ్‌ కాలేయ దాత దొరకకపోవడంతో బాబును కాపాడాలని సోషల్‌ మీడియా, పత్రికా ప్రకటనల ద్వారా వేడుకుంటోంది. ఎవరైనా చిన్నారి కాలేయ మార్పిడికి సహకరించాలని, చేతిలో చిల్లిగవ్వ లేదని కోరుతోంది. ప్రభుతం సహకరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

Updated Date - 2020-06-05T10:52:12+05:30 IST