Advertisement
Advertisement
Abn logo
Advertisement

వాచ్‌మెన్‌ కుటుంబానికి సాయం

కందుకూరు, డిసెంబరు 8 : ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తూ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సాంబశివరావు కుటుంబానికి స్కూల్‌ యాజమాన్యం సాయం అందించింది. ఆక్స్‌ఫర్డ్‌ విద్యాసంస్థల యాజమాన్యం, ఉపాధాయ్యలు, విద్యార్థులు జమచేసిన రూ.1,75,000 నగదును బుధవారం కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి సమక్షంలో సాంబశివరావు భార్యకు అందజేశారు. ఈ సందర్భంగా ఆక్స్‌ఫర్డ్‌ విద్యా సంస్థల చైర్మన్‌ ఉన్న భాస్కరరావు, కరస్పాండెంట్‌ బండి.వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు బెజవాడ నరేంద్ర బాబు, బాలభాస్కరరావులు చిరుద్యోగి కుటుంబం పట్ల చూపిన మానవత్వానికి ఎమ్మెల్యే అభినందించారు.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

కందుకూరు : ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న ఆరుగురికి ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి బుధవారం చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని గుడ్లూరు మండలం పరకొండపాడు గ్రామానికి చెందిన చెరుకూరి వైష్ణవికి రూ.20000, వలేటివారిపాలెం మండలం రోళ్లపాడు గ్రామానికి చెందిన నాగిరెడ్డి చిన ఆంజనేయులుకు రూ. 38000  వలేటివారిపాలెం మండలం నలదలపూరు గ్రామానికి చెందిన అత్తోట హనుమంతరావుకు రూ.1,20.000  కందుకూరు మండలం మోపాడు గ్రామానికి చందిన వడ్లమూడి శ్రీనివాసులుకు రూ. 75000, కందుకూరు పట్టణానికి చెందిన షేక్‌ కరిమున్‌కి రూ.50000, యాత్రాసి వెంకట శివసాయి మనోజ్‌కు రూ.28000 విలువైన చెక్కులు మంజూరయ్యాయి. చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.

ఉలవపాడు : రికార్డులు సక్రమంగా లేకుండానే ఆన్‌లైన్‌ పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేస్తున్నారని అటువంటి అధికారులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని కందుకూరు శాసన సభ్యులు మానుగుంట మహీధర్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు. మండల రెవెన్యూ కార్యాయంలో బుధవారం ఆయన ప్రత్యేక ప్రజాస్పందన కార్యక్రమం నిర్వహించారు.  కొత్తగా మంజూరైన 75 పట్టాదారు పాసుపుస్తకాలు అర్హులైన రైతులకు అందజేశారు. డాటెడ్‌ ల్యాండ్‌, ఆన్‌లైన్‌ కోసం వచ్చిన స్ధానికుల నుంచి వినతులు స్వీకరించారు. తహసీల్దార్‌ కే సంజీవరావు, ఆర్‌ఐ బ్రహ్మయ్య, సర్వేయర్‌ శ్రీనివాసరావు, వీఆర్వోలు ఉన్నారు.

Advertisement
Advertisement